Telangana: ఖమ్మం ఎంపీ నామా కొడుకుపై కారులో దాడి చేసిన దుండుగులు, అనంతరం రూ. 75 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

TRS ఎంపీ నామా నాగేశ్వర రావు కొడుకు పృథ్వీ తేజ దారి దోపిడికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని (Nama Prithvi Teja) ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు.. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు.

Telangana: ఖమ్మం ఎంపీ నామా కొడుకుపై కారులో దాడి చేసిన దుండుగులు, అనంతరం రూ. 75 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
Representational Image | (Photo Credits: IANS)

Hyd, August 2: ఖమ్మం TRS ఎంపీ నామా నాగేశ్వర రావు కొడుకు పృథ్వీ తేజ దారి దోపిడికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని (Nama Prithvi Teja) ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు.. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు. అనంతరం డ్రైవింగ్‌ సీట్లో ఉన్న పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించి దాడి చేశారు. బలవంతంగా రూ. 75 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరారయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ (Khammam MP Nama Nageswara rao) కొడుకు పృధ్వీ వ్యాపారం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. శనివారం స్నేహితుడి వద్దకు కారులో వెళుతుండగా టోలిచౌకి వద్ద ఇద్దరు వ్యక్తులు తమ బైక్ అడ్డుపెట్టి బలవంతంగా కారులోకి ఎక్కారు. డ్రైవింగ్ సీటులో ఉన్న పృధ్వీ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే వైన్స్ లో మద్యం సేవించారు.

సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేశాడనే కక్ష, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం, నిందితుడిని అరెస్ట చేసిన పోలీసులు 

అక్కడి నుంచి కొండాపూర్ వెళుతుండగా దారిలో మరో వ్యక్తి ఎక్కాడు. ఆ ముగ్గురూ కలిసి కారులోనే నామా కొడుకుపై పిడిగుద్దులతో దాడి చేశారు. SR Nagar లో ఆగి ఉన్న బైకును ఢీకొట్టి తిరిగి పంజాగుట్టవైపు వెళుతుండగా నిమ్స్ వద్ద వారంతా కారు నుంచి దూకి పరారయ్యారు. ఈ ఘటనపై పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నామా కొడుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు ప్రారంభించారు.

(The above story first appeared on LatestLY on Aug 02, 2022 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).