Hyd. July 25: గత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలకు ఉత్తరాంధ్ర విలవిల, స్కూళ్లకు సెలవులు, ఏజెన్సీ గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు
ఇక తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. ఇక, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ముసురు వర్షం మొదలైంది.. 2024 జూలై 24వ తేదీ మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది. జల్లులు పడుతున్నాయి.