Hyd, July 16: ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ఉదృతంగా ప్రవహిస్తుండగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించగా అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీసే ఛాన్స్ ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు సూచించారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వాన కురుస్తుండటంతో స్కూళ్లు,కాలేజీలు,ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, తార్నాకలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులుగా ఉండగా ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది. వర్షాలతో జురాల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున రతలివస్తున్నారు. ఇక జురాల నుండి శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో కృష్ణా పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలకు ఉత్తరాంధ్ర విలవిల, స్కూళ్లకు సెలవులు, ఏజెన్సీ గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు
రానున్న రెండులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేయగా మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
Here's Tweet:
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పోటెత్తిన వరద..!#Telangana #AndhraPradesh #HeavyRains #Rains #NTVTelugu pic.twitter.com/XCns6QaGBH
— NTV Telugu (@NtvTeluguLive) July 20, 2024
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఉప్పొంగిన కాలువలు! | Heavy Rains - TV9
TV9 News యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి : https://t.co/YOmRtQwe8l#heavyrain #farmers #latestnews pic.twitter.com/5sBFTGPkNk
— TV9 Telugu (@TV9Telugu) July 20, 2024
Godavari | భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం-Namasthe Telanganahttps://t.co/fqU8ovnlcu
— Namasthe Telangana (@ntdailyonline) July 20, 2024
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఏజెన్సీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు.
వై రామవరం మండలం బొడ్లంక వెళ్లే ప్రార్థనలో ఉదృతంగా ప్రవహిస్తున్న రేవు వాగు.
సుమారు 70 గ్రామాలకు రాకపోకలు అంతరాయం.. pic.twitter.com/7RNyafUHI2
— ChotaNews (@ChotaNewsTelugu) July 20, 2024
జలదిగ్బందంలో దిందా గ్రామం
కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందాను వరదనీరు చుట్టుముట్టడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. జలమయంగా మారిన గ్రామస్తుల నివాసాలు. pic.twitter.com/v9It7umsnh
— ChotaNews (@ChotaNewsTelugu) July 20, 2024