
Hyderabad, Mar 2: తెలంగాణలో (Telangana) రోజురోజుకీ ఉష్ణోగ్రతలు (Temperature) పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు చేరగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 38 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
