Hyderabad, Aug 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు (Telangana CS Orders) జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు (District Collectors) తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. నెలకు ఒక సారి రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా స్కూళ్లు, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని చెప్పారు.
కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు.. నెలకోసారి ప్రభుత్వ హాస్టల్లలో నిద్ర చేయాలి
జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో తనిఖీ చేయాలి. నెలకు ఒకసారి కలెక్టర్లు రెసిడెన్షియల్స్, హాస్టల్స్లో నిద్రచేయాలి. స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను… pic.twitter.com/Z25ODksp4J
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024
ఎందుకు?
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలుషిత ఆహారం, విష జ్వరాలు, సౌకర్యాల లేమి తదితర సమస్యలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో పరిస్థితులను కలెక్టర్లు స్వయంగా తెలుసుకోవడానికే ఈ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.