TSRTC Bus (Credits: X)

Hyderabad, June 26: ఇకపై ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర (Change) వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం (Paytm), డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ తదితర అన్నీ రకాల పేమెంట్స్‌ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు. సాధారణంగా బస్సు టికెట్ల జారీలో చిల్లర బెడద కారణంగా కండక్టర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులను (Online Transfers) ప్రోత్సహించి టికెట్‌ జారీ చేయడానికి గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు చర్యలు మొదలెట్టారు. అందులో భాగంగానే బండ్లగూడ డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 70 బస్సుల్లో టికెట్‌ జారీ యంత్రాలను కండక్టర్లకు అందజేశారు. 20 రోజుల నుంచి డిజిటల్‌ చెల్లింపులతోనే టికెట్లు జారీ చేశారు. ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలున్నాయా? ఎంత సమయంలోపు పేమెంట్‌ అవుతుంది? స్కాన్‌ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా? తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తేలింది. దీంతో నగర వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను తీసుకురాబోతున్నారు.

TS Inter Supply Results 2024 Out: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫలితాలను నేరుగా tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి 

అందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశా రు. కాగా, గ్రేటర్‌లో 2841 బస్సులు ఉన్నాయి. వివిధ మార్గాల్లో 31,369 ట్రిప్పులు బస్సులు తిరుగుతాయి. ప్రతీ రోజు 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. బస్సుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాబోతుండటం పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.