Basara, Aug 16: నిర్మల్ లోని బాసరలో (Basara) కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో (Saraswathi Temple) చోరీ జరిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు. టికెట్ కౌంటర్ దగ్గర తచ్చాడాడు. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎంతమేరకు చోరీ జరిగిందో తెలియాల్సి ఉంది.
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ..
నిర్మల్ - బాసర అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించి.. ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేసిన దుండగుడు..
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.. విచారణ జరుపుతున్న పోలీసులు.. pic.twitter.com/aQdg9nPz3k
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024
చోరీ జరిగిన స్థలాలు..
అమ్మవారి ఆలయంలో ప్రసాదం టికెట్ కౌంటర్, ఉప ఆలయం దత్తాత్రేయ ఆలయం ముందర ఉన్న హుండీలో నగదు, ఆ హుండీలో భక్తులు మొక్కులు చెల్లించిన బంగారం, వెండి చిన్న ఆభరణాలు, మహంకాళి ఆలయం ముందర ఉన్న కౌంటర్ తదితర ప్రాంతాల్లో చోరీ జరిగినట్టు పోలీసులు తెలిపారు.