New Year Celebrations: ఈసారి అమ్మాయిలు తక్కువేమి తాగలేదు! రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం సేల్స్, మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య పెరగడం ఓ కారణం, ఒక్కరోజులో ప్రభుత్వానికి రూ. 350 కోట్ల నెట్ ఆదాయం
Image used for representational purpose only | Photo: Pexels

Hyderabad, January 2: తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల్లో (New Year Celebrations) మద్యపాన ప్రియులు దాదాపు రూ. 500 కోట్ల విలువైన మద్యం సేవించినట్లు ఎక్సైజ్ శాఖ విభాగం అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే 60 శాతం మద్యం అమ్మకాలు (Liquor Sales) జరిగాయి. డిసెంబర్ 31 రోజున గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో సుమారు రూ. 350 కోట్ల మద్యం సేల్ అయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని ద్వారా ఒక్కరాత్రిలో  ప్రభుత్వానికి వచ్చిన నెట్ ఆదాయం రూ. 350 కోట్లు.

ఆర్థిక మందగమనం కారణంగా నగరంలో ఈసారి నిర్వహించిన నూతన సంవత్సర కార్యక్రమాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, లైసెన్స్ పొందిన అవుట్లెట్ల ద్వారా మరియు బార్లలో మద్యం అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 15 శాతం పెరిగాయి.

ఈసారి మద్యపాన ప్రియుల్లో మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారట. ఇది కూడా సేల్స్ పెరగటానికి ఒక కారణం అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నూఇయర్ వేడుకల్లో పాశ్చాత్య సంస్కృతి పోకడలు, వాతావరణ పరిస్థితులు, మద్యం అమ్మకాల్లో కొత్తకొత్త స్కీములు తదితర కారణాల చేత ఈ ఏడాది మద్యం సేల్స్ భారీగా పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా మద్యం అమ్మకాలు పెరిగాయి. ఒక్కరాత్రిలో రాష్ట్రవ్యాప్తంగా 1,91,323 కేసుల బీరు, 2,11,515 కేసుల లిక్కర్ అమ్ముడైంది.

ఏదైమైనా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అదనపు ఆదాయాలు ఊరట కలిగిస్తాయి.