Hyderabad, Sep 15: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి గత పది రోజులుగా భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
Here's Video:
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథుడు.#VinayakaChavithi #KhairatabadGanesh #Hyderabd #Bigtv pic.twitter.com/A0oj6xUtBU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2024
అలా 70 అడుగుల ఎత్తు
1954లో ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం ప్రారంభమైంది. గణపతి ప్రతిష్టించడం ఈ ఏడాదికి 70 ఏండ్లు. దీన్ని పురస్కరించుకొని 70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణ హితమైన మట్టి గణపతిని నిర్వాహకులు తీర్చిదిద్దారు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు