Hyderabad, June 28: బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా (Meer Alam tank eidgah) ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.
ఈ వాహనాలను జూ పార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా పార్కు చేయాలి.
సాధారణ ట్రాఫిక్‌కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్‌బాగ్, కామాటిపూరా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు.
శివరాంపల్లి, ధనమ్మ హట్స్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు.
ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలు ధనమ్మ హట్స్ క్రాస్‌రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్లలో వెళ్లాలి.
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాటిని పురానాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు.
లాపత్తర్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.