హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా తాను రాసిన కవితను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందని కవిత అభిప్రాయపడ్డారు.
Wearing and applying Sindoor is my conscious choice
Wearing Hijab is Muskan’s choice.
Let women decide what they are comfortable in embracing and wearing.#DontTeachUs pic.twitter.com/wDuYVW6X5O
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2022
ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం ధరించాలి? అన్నది మహిళలకే వదిలేయాలని కవిత కోరారు. ఏమతమైనా అందరం భారతీయులమేనని గుర్తుంచుకోవాలని చెప్పారు.
సింధూర్, టర్బన్, హిజాబ్, క్రాస్ ఏది ధరించినా చివరకు మన గుర్తింపు భారతీయతేనని కవిత చురకలంటించారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ ఏదైనా వారి సంప్రదాయాలను పాటించేందుకు సహకరించాలని కవిత కోరారు.