Hyderabad, Feb 10: తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) ను నేడు శాసనసభలో (Assembly) ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ (Loksabha) ఎన్నికలకు ముందు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెడతారు. సుమారు 2.95 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలను రూపొందించారని తెలిసింది. సంక్షేమం- అభివృద్ది ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. బడ్జెట్ లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత లభించనుంది.
నేడే తెలంగాణ బడ్జెట్...#Telangana #TelanganaAssemblyBudgetSession2024 #NTVTelugu https://t.co/wgwpgpKebo
— NTV Telugu (@NtvTeluguLive) February 10, 2024
విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి సర్కారు భారీగా నిధులు కేటాయించనుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ చెబుతోంది. ప్రతి పక్షనేత కేసీఆర్ నేడు సభకి హాజరు కానున్నట్టు సమాచారం.
Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే