తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను (TS Inter Academic Calendar 2021) బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్‌లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది.
అక్టోబర్ 13 నుంచి 16 వరకు దసరా సెలవులు ఉంటాయి. డిసెంబర్ 13 నుంచి 18 వరకు ఆరు నెలల పరీక్షలు జరుగుతాయి. 2022 జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10న మొదలై 18న ముగుస్తాయి. పైనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొదలై మార్చ3 25 వరకు జరుగుతాయి. ఫైనల్ పరీక్షలు మార్చి 23 న మొదలై ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. చివరి పని దినం ఏప్రిల్ 13గా నిర్ణయించారు.