TS TET Notification:టీచర్ జాబ్ కోసం చూస్తున్నారా? గుడ్ న్యూస్, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల, మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేసుకోండి! జూన్ 12న టెట్ ఎగ్జామ్

Hyderabad, March 25: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయుల నియామకానికి (Teacher recruitment) ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)కు సంబంధించి తెలంగాణ సర్కారు (Telangana Govt.) గురువారం రోజున నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్ 12న టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. టెట్ నోటిఫికేషన్ కోసం ఈ నెల 25 నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రకటనలో పేర్కొంది.తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఒక రోజు క్రితమే అనుమతులను మంజూరు చేసింది. అంతేకాదు.. టెట్ అర్హతల్లోనూ పలు మార్పులు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు.. టెట్ పేపర్ 1కు బీఈడీ (BEd) చేసిన వారు కూడా అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవోను రిలీజ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే SGT పోస్టులకు BEd చేసిన వారికి కూడా అర్హత పొందవచ్చు.

Telangana Government Jobs: తెలంగాణ కొలువుల జాతరలో కీలక ఘట్టం, 30వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులు, శాఖల వారీగా వివరాలు ఇవే! ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో తెలుసా?

ఉద్యోగం సాధించిన వారు రెండేళ్లలో ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. టెట్ వ్యాలిడిటీని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పొడిగించిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. టెట్ నిర్వహణకు సంబంధించి పూర్తి కాగానే.. టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

AP Three Capitals Row: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తోంది. టెట్‌ను 150 మార్కులకు నిర్వహించనున్నారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులతో అర్హత సాధిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ర్యాంకు కేటాయించనున్నారు.