Representational Image (File Photo)

Hyderabad, July 07: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. బీఈడీ (Bed), డీఈడీ (Ded) కోర్సులు పూర్తి చేసి టీచ‌ర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపిక‌బురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET‌) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్‌ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది.

Rajaiah Vs Kadiam Srihari: కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ల సృష్టికర్త, ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న వ్యక్తి కడియం అంటూ ఫైరయిన తాటికొండ రాజయ్య, స్టేషన్ ఘన్ పూర్‌ లో ముదిరిన మాటలయుద్ధం 

విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra reddy) అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.