TSRTC Green Metro Luxury Ac Buses

Hyderabad, SEP 20: పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ తీసుకొస్తుంది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు (Green Metro Luxury Ac Buses) పరుగులు తీయనున్నాయి. ఇవాళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు.  మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో (Green Metro Luxury Ac Buses) మొదటి విడతగా 25 బస్సులను ప్రారంభించనున్నారు. దీంతో నగరవాసులకు మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Telangana Assembly Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం 

ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ (puvvada ajay) గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govrdhan), ఎండీ సజ్జనార్ (Sajjanar) కూడా పాల్గొననున్నారు. మిగిలిన 25 బస్సులను నవంబర్ నెల నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ ఆర్టీసీ సంస్థ (TSRTC) ప్రకటించింది.

Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ప్రకాశంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, యర్రగొండపాలెం వద్ద బోల్తాపడిన ఆర్టీసీ ఇంద్ర బస్సు, 8 మందికి గాయాలు 

ఈ బస్సులు వాయు కాలుష్యాన్ని వెదజల్లవని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలో మీటర్లు ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది. మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపు వందశాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడమే కాకుండా క్యాబిన్ సెలూన్ లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ సదుపాయాలు కూడా కలిగి ఉన్నాయి.