Hyderabad, May 11: టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ అధికారులు, ఇతర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి (Dress code) విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుండి ఆర్టీసీ ఉద్యోగులు అందరు ఫార్మల్ డ్రెస్సులోనే ఉద్యోగాలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
టీఎస్ ఆర్టీసీ (TSRTC Dress Code) యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించడం సరికాదని మండిపడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.