Hyderabad, May 11: నేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగాలు, ఇతరత్రా కారణాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా సోమవారం జరుగనున్న ఓటింగ్ లో పాల్గొనడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర క్యూకట్టాయి. పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తుండటంతో భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మరోవైపు నగరవాసులు స్వస్థలాలకు వెళ్తుండటంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Traffic Jam | క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్https://t.co/y9PHOcgEhT
— Namasthe Telangana (@ntdailyonline) May 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)