Image used for representation purpose only. | File Photo

Hyderabad, February 12:  ప్రముఖ 'రైడ్ షేరింగ్' సంస్థ ఉబెర్ (Uber), ఇండియాలో తొలి గ్లోబల్ ఫిన్‌టెక్ (Uber Fintech) కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఏసియా-పసిఫిక్ ప్రాంతంలోనే తొలి ఆఫీస్ కాబోతుంది. ఉబెర్ మనీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ టీమ్స్ ఇప్పటివరకు శాన్ ఫ్రాన్సిస్కో, పాలో ఆల్టో, న్యూయార్క్ మరియు ఆమ్‌స్టర్‌డ్యాంలలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భాగ్యనగరానికి రాబోతుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.

డేటా సైన్స్, అనలిటిక్స్ మరియు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాలను అభివృద్ధిపరచటంతో పాటు హైదరాబాద్‌ను ఉబెర్ కోసం పూర్తి స్పెక్ట్రం టెక్ సైట్‌గా మార్చడానికి పెట్టుబడులు పెడుతున్నామని సంస్థ పేర్కొంది. తెలంగాణలో రెండు భారీ డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టిన యూఎస్ టెక్ దిగ్గజం అమెజాన్ 

ఈ వేసవి నాటికి ఏర్పాటయ్యే ఉబెర్ మనీ సర్వీసెస్ (Uber Money Services) లో 100 మందికి పైగా సాంకేతిక నిపుణులను కలిగి ఉబెర్ యొక్క గ్లోబల్ ఫైనాన్స్ మరియు టెక్నాలజీ ఇన్నోవేషన్స్ వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుంది.

ఉబెర్ రైడర్స్ యొక్క డిజిటల్ చెల్లింపులో ఎటువంటి మధ్యవర్తి యాప్స్ తో చెల్లింపులు చేసే అవసరం లేకుండా ఉబెర్ డ్రైవర్లకు మరియు రైడర్లకు మధ్య మెరుగైన, సులువైన సేవలు అందించడం కోసం ఉబెర్ మనీ టీమ్ అందుబాటులో ఉంటుంది.  ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేటీఆర్, దావోస్‌లో తెలంగాణ మంత్రికి అరుదైన గౌరవం

రియల్ టైమ్ రెవెన్యూ, డెబిట్ ఖాతాల అప్‌డేట్స్, ఉబెర్ డ్రైవర్ల కోసం కార్డులు, ఉబెర్ వాలెట్ నిర్వహణ మరియు ఉబెర్ రైడర్‌ల కోసం ఉబెర్ క్రెడిట్ కార్డుతో సహా సరికొత్త గ్లోబల్ ఫీచర్లను మెరుగుపరచడంలో హైదరాబాద్ టీమ్ పని చేస్తుందని సంస్థ వెల్లడించింది.