Hyderabad, July 21: బీజేపీ తెలంగాణ (Telangana) నాయకురాలు విజయశాంతి చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ (Hyderabad) నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీని గురించి విజయశాంతి ట్వీట్ చేశారు. ” బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఎందుకు వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరికాదు. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని… pic.twitter.com/l22P9lvyxm
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 21, 2023
అయితే, అప్పట్లో తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది.. జై శ్రీరామ్. హర హర మహాదేవ.. జై తెలంగాణ ” అని పేర్కొన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ట్వీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తీరును విజయశాంతి పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. తాజాగా ఆయనతో స్టేజి పంచుకునేందుకు ఇబ్బందిపడ్డట్లు బహిరంగంగా చెప్పడం సంచలనంగా మారింది.