Congress MP Revanth Reddy | File Photo

Hyderabad, August 28: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో (2015 Cash for Vote Scam) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు శనివారం సమన్లు (nampally court Issues summons) జారీ చేసింది. ఓటుకు కోట్ల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. అదే విధంగా సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌కు కూడా నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు జారీ చేసిన ఈడీ కేసులపై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. అక్టోబర్‌4న విచారణకు హాజరు కావాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టు ఆదేశించింది.

2015 మే 21న స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి (Tpcc president revanth reddy ) పట్టుపడ్డారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

తీన్మార్‌ మల్లన్న అరెస్ట్, జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడని ఆరో‌ప‌ణ‌లు, చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ

కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే. అప్ప‌ట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది.

ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.