
Hyderabad, March 16: లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్తులను తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టింది. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ (Pasunoori dayakar) కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న పసునూరి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో కాంగ్రెస్‌లో ఆయన చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
Warangal BRS MP Pasunuri Dayakar met CM Revanth Reddy pic.twitter.com/iHnhBTM1cU
— Naveena (@TheNaveena) March 15, 2024
మరోసారి వరంగల్ ఎంపీ సీటును (Warangal MP) ఆశించి దయాకర్ భంగపడ్డారు. ఇటీవల వరంగల్ నేతలతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఎంపీ సీటును కేటాయించారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తాను కోరినప్పటికీ అధిష్టానం పట్టించుకోకపోలేదు. దాంతో పసునూరి దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ పసునూరి హస్తం గూటికి చేరారు.
మరోవైపు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారమే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు (క్రీడా వ్యవహారాలు)గా జితేందర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.