Hyderabad, July 21: హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై (Bike Accident on Balanagar Flyover) విషాదం చోటు చేసుకుంది.ఫ్లైఓవర్ మీద బైక్‌పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి (Young Man Died in Road Accident) చెందాడు. లైసెన్స్ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా బైకుమీద ప్రయాణిస్తుండగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడు
ఘటన వివరాల్లోకెళితే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై (Hyderabad's Balanagar flyover) నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టాడు.
Here's Video
హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది.వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టాడు.
గమనించిన వాహనదారులు వెంటనే 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు
Read More >> https://t.co/cRnTLSrwvp#BalaNagar #V6News #BalaNagarflyover pic.twitter.com/fedk5AaaIl
— V6 News (@V6News) July 21, 2021
ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు