Credits: Twitter/TTD

Tirumala, Dec 17: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన (TTD Arjita Seva Tickets) సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్‌ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ లో ఘటన (వీడియో)

24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..

మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. తిరుమల, తిరుపతిల‌లో మార్చి నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్‌ చేస్తామని చెప్పింది.

పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!