Parliament (photo-ANI)

Newdelhi, Dec 17: దేశవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై (One Nation-One Election) నేడు మరో కీలక అడుగు పడనుంది. మంగళవారం లోక్‌ సభలో (Lok Sabha) కేంద్రం జమిలికి వీలు కల్పించే రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మేఘ్వాల్‌ కోరనున్నారు. ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు.  కాగా, లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్ర మంత్రివర్గం రెండు బిల్లులను తాజాగా ఆమోదించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కన పెట్టింది.

తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

మద్దతు ఇలా.. వ్యతిరేకం అలా..

జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇదే సమయంలో 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ మేరకు ఇప్పటికే రామ్‌ నాథ్‌ కోవింద్‌ కమిటీ ప్రకటించింది.

తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి