ప్రస్తుతం UIDAI 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) చివరి తేదీ అని UIDAI ప్రకటించింది. మీరు ఈ తేదీలోగా పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వయస్సుకు సంబంధించి ఆధార్ కార్డ్‌లో మార్పులు చేయాలనుకుంటే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాలి. గతంలో దీని గడువు చాలాసార్లు పొడిగించబడింది. దీంతో ఈసారి సెప్టెంబర్ 14 తర్వాత గడువు పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉంది.మీ ఆధార్ కార్డ్‌ని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి
ఆధార్ కార్డ్ అప్‌డేట్ ఎలాగంటే..
ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in కి వెళ్లి లాగిన్ అవ్వాలి
లాగిన్ కోసం మీ ఆధార్ కార్డ్ నంబర్, అక్కడ ఇవ్వబడిన అక్షరాలను నమోదు చేయాలి
మీ ఆధార్ కార్డ్‌లో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, మీరు పోర్టల్‌లో నమోదు చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి
లాగిన్ అయిన తర్వాత, మీకు స్క్రీన్‌పై అనేక ఎంపికలు కనిపిస్తాయి, వాటిలో మీరు 'ఆధార్ అప్‌డేట్'పై క్లిక్ చేయాలి
అక్కడ మీరు మీ ప్రొఫైల్ చూస్తారు. అప్పుడు మీరు అప్‌డేట్ వివరాలు నమోదు చేయండి.
చిరునామా మారినట్లయితే, చిరునామా రుజువు పత్రం వంటి అప్‌డేట్‌కు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించాలి
చివరగా మీరు మీ అభ్యర్థన స్థితిని ట్రాక్ చేయడానికి SMS ద్వారా అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN)ని అందుకుంటారు
ఈ నంబర్ ద్వారా మీరు మీ అప్‌డేట్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు