Mumbai, JAN 13: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువును జనవరి 15, 2025 వరకు పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ (UAN Activation) కోసం గడువు నవంబర్ 30, 2024 ఉండగా, ఆ తర్వాత డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. “దయచేసి సర్క్యులర్‌లను చూడండి. దీనికి సంబంధించి, ఉద్యోగులందరి బ్యాంక్ ఖాతాలో UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ కోసం కాంపిటెంట్ అథారిటీ 15.12.2024 నుంచి 15.01.2025 వరకు టైమ్‌లైన్‌ని పొడిగించింది” అని ఈపీఎఫ్ఓ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
యూఎఎన్ అనేది ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను నిర్వహించడానికి సాయపడే 12-అంకెల సంఖ్య. ఈపీఎఫ్ఓ (EPFO) ద్వారా ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌కి లింక్ చేయడం తప్పనిసరి. “దేశంలో ఉద్యోగ కల్పనపై దృష్టి సారించే ఉపాధి-కేంద్రీకృత పథకం ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు మీ బ్యాంక్ ఖాతాతో మీ ఆధార్‌ను సీడ్ చేయడం తప్పనిసరి. చివరి నిమిషంలో అవాంతరాలను నివారించడానికి సమయానుకూలంగా చేయండి. ఈపీఎఫ్ఓ అధికారిక హ్యాండిల్ Xలో పోస్ట్ అయింది.
ఈపీఎఫ్ యూఎఎన్ ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్( www.epfindia.gov.in)కి వెళ్లండి.
‘Our Services’పై క్లిక్ చేసి, ’employees’పై క్లిక్ చేయండి.
‘మెంబర్ యూఎఎన్ / ఆన్‌లైన్ సర్వీసులు’ ఎంచుకోండి.
‘మీ యూఎఎన్ యాక్టివేట్ చేయండి. (కుడి వైపున ఉన్న ‘ముఖ్యమైన లింక్‌లు’ ) ఎంచుకోండి.
యూఎఎన్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేసి, ‘GetAuthorization pin’పై క్లిక్ చేయండి.
అప్పుడు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
‘I Agree’ఎంచుకుని, OTPని ఎంటర్ చేయండి
‘OTPని ధృవీకరించండి. యూఎఎన్ యాక్టివేట్ చేయండి’పై క్లిక్ చేయండి