Mumbai, November 30: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో(Bharti Airtel, Reliance Jio)లు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ రెండు కంపెనీల యూజర్లు సిగ్నల్ అవసరం లేకుండానే ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం నెట్‌వర్క్‌లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్(VoWi-Fi calling support)ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియాకి ఇప్పుడు వచ్చింది. ఈ వోవైఫై(VoWi-Fi) కాలింగ్ ని ఎలా వాడాలో ఓ సారి చూద్దాం.
వోవైఫై అంటే వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్(VoWi-Fi calling) ప్రధానంగా వైఫై కనెక్షన్ తో వాయిస్ కాల్స్ చేసుకోవడానికి సాయపడుతుంది. సిగ్నల్ లేకపోయినా, చాలా తక్కువ సిగ్నల్ పాయింట్లు చూపిస్తున్నా దీనిని వాడుకోవచ్చు. కాగా వోల్ట్ లేదా వాయిస్ ఓవర్ ఎల్టీ ద్వారా 4జీ లేదా ఎల్టీఈ నెట్‌వర్క్‌లను వాయిస్ కాల్స్ రూపంలో మాత్రమే వాడుకోవాలి. యూజర్ ఇంటర్నెట్ వాడుకుంటున్నప్పటికీ హై క్వాలిటీ వాయీస్ కాల్స్ ఇందులో లభిస్తాయి. అయితే వోల్ట్ ఫీచర్ మొబైల్ నెట్‌వర్క్ లేకుండా పనిచేయలేదు. ఇప్పుడు రానున్న వో వైఫై నెట్‌వర్క్ లేకున్నా వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కాల్ చేసుకునేందుకు సహాయపడుతుంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో వాడడం ఎలా?
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఐఫోన్‌లో మొబైల్ డేటా క్లిక్ చేసి తర్వా వైఫై కాలింగ్ ను ఆన్ చేయాలి. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఒక్కో ఫోన్‌లో వేరేలా ఉంటుంది. చాలా స్మార్ట్ ఫోన్లలో సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్‌వర్క్స్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్లలోవో వైఫై కాలింగ్ ఆన్ చేశాక, లో నెట్ వర్క్, సిగ్నల్ పోయినా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అయితే మీరుఫ్లైట్ మోడ్ లో కాల్ చేయాలని ప్రయత్నించొద్దు. తప్పనిసరిగా సిగ్నల్ తక్కువ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత వైఫై కాల్ కనెక్ట్ అవుతుంది. వీటికి ప్రత్యేకంగా ఎటువంటి ఛార్జీలు ఉండవు. వైఫై ద్వారా మాత్రమే కాల్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.