దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. ఇకపై ఎయిర్టెల్ యూజర్లు కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ తో రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది.
ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా , 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది.