Alphabet.Inc ( Photo credits : Wikimedia Commons)

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిచ్చింది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగులను తీసేసింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ 10వేల మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది.

800 మంది ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో, Internal Test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి

టెక్‌ దిగ్గజ సంస్థల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలంపులు ఐటీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉంది. ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.