File (Credits: Twitter)

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ సంస్థలో ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు. కంపెనీ నుంచి 27 వేల మందిని తొలగించడం అనేది చాలా కఠినమై నిర్ణయం.. కానీ తప్పలేదని తెలిపారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

పీఎం నరేంద్ర మోడీని ఫాలో అవుతున్న ఎలాన్ మస్క్, తన ట్విట్టర్ పేజీలో తాజాగా వెల్లడి

ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కంపెనీ వృద్ధికి సహాయపడతాయనే విశ్వాసాన్నివ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించే నిర్ణయం కష్టమైనదే కానీ దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు కంపెనీ ఎదుర్కొన్నసవాళ్లను వివరిస్తూ వాటాదారులకు సీఈవో వార్షిక లేఖ రాశారు. ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు అమెజాన్ కంపెనీకి చెందిన ఫిజ‌క‌ల్ స్టోర్స్‌ను మూసి వేశా మ‌న్నారు. అమెజాన్ ఫ్యాబ్రిక్‌, అమెజాన్ కేర్ ఎఫ‌ర్ట్స్‌ను కూడా మూసివేసిన‌ట్లు చెప్పారు.

ఇకపై ట్విట్టర్ పోస్టుల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చిన ఎలాన్ మస్క్, పూర్తి వివరాలు ఇవిగో..

తొలగించిన ఉద్యోగులకు తెగతెంపుల చెల్లింపు, తాత్కాలిక ఆరోగ్య బీమా ప్రయోజనాలతో పాటు బయట ఉపాధిని కనుగొనడంలో సహాయం అందిస్తుంది. దీంతో పాటుగా మే నెల నుండి సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేస్తారని ఆండీ జాస్సీ పేర్కొన్నారు.