ఇన్ స్టా మాదిరిగానే ట్విట్టర్ లోనూ యూజర్లు తమ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించునే వెసులుబాటు కల్పించనున్నారు.ఈ మేరకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక విధివిధానాలను మార్చేస్తున్నారు.అందులో భాగంగానే మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చినట్టు మస్క్ వెల్లడించారు.
భారీ టెక్ట్స్ కంటెంట్, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు సహా తమ కంటెంట్ పై యూజర్లు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని వివరించారు. ట్విట్టర్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ అనే ఫీచర్ పై క్లిక్ చేస్తే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని మస్క్ తెలిపారు.
పీఎం నరేంద్ర మోడీని ఫాలో అవుతున్న ఎలాన్ మస్క్, తన ట్విట్టర్ పేజీలో తాజాగా వెల్లడి
ఈ మానిటైజేషన్ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులో ఉందని, త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. ఈ మానిటైజేషన్ ప్రోగ్రాం ద్వారా యూజర్లకు లభించే డబ్బులో 12 నెలల పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోదని తెలిపారు. యూజర్లు ఎప్పుడు కావాలనుకున్నా తమ కంటెంట్ తో ట్విట్టర్ ను వీడవచ్చని మస్క్ స్పష్టం చేశారు.