Hyderabad, Oct 31: యాపిల్ కంపెనీ (Apple Company) సోమవారం కొత్త ఐమ్యాక్ (IMac), ల్యాప్ టాప్ లతోపాటు థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ని (Mac Processor) ఆవిష్కరించింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ హార్స్ పవర్ తో ఎం3 చిప్ ని అందించినట్టు తెలిపింది. కొత్త చిప్ లైనప్ అధునాతన 3-నానోమీటర్ తయారీ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపింది. బేస్ మోడల్ లో ఎనిమిది ప్రధాన కోర్స్(చిప్‌లోని ప్రాసెసింగ్ ఇంజన్లు), గ్రాఫిక్స్ కోసం అదనంగా 10 కోర్స్ ఉంటాయని తెలిపింది.
Apple's "Scary Fast" Event: New M3 Chip, iMac, MacBook Unveiledhttps://t.co/2eHNLlLNUR
— Alvi (@alvi_alvisyauqi) October 31, 2023
బ్యాటరీ సామర్థ్యం ఇలా..
బ్రాండెడ్ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ‘స్కేరీ ఫాస్ట్’లో భాగంగా వీటిని విడుదల చేసినట్టు తెలిపింది. కాగా కొత్తగా ఆవిష్కరించిన కొత్త మ్యాక్ బుక్ ప్రో మోడల్స్ కొత్త ప్రాసెసర్ లతో వచ్చాయి. 22 గంటల బ్యాటరీ సామర్థ్యంతో మరింత శక్తివంతంగా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది.