Asus New Laptops: తైవాన్‌కు చెందిన కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఏసూస్ తాజాగా రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Zenbook S13 OLED మరియు Vivobook 15 అనే పేర్లతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌లు రూ. 50 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో Vivobook 15 అనేది బేస్ వేరియంట్ ల్యాప్‌టాప్ కాగా, Zenbook S13 OLED అనేది టాప్ వేరియంట్ ల్యాప్‌టాప్.
కంపెనీ ప్రకారం, ఈ రెండు ల్యాప్‌టాప్‌లు పర్యావరణ స్పృహతో రూపొందించబడినవి. తేలికపాటి బరువు, నాజూకైన డిజైన్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లను ఎక్కడికైనా మోసుకెళ్లగలగడం కూడా సులభంగా, సౌకర్యంగా ఉంటుంది.
మెరుగైన పనితీరు, అద్భుతమైన సామర్థ్యంతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Asus Vivobook 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
- యాంటీ గ్లేర్ ఫినిషింగ్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే
- 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఇంటెల్ కోర్ 5U-సిరీస్ ప్రాసెసర్
- ఆడియో: SonicMaster AI నాయిస్ క్యాన్సిలింగ్ ఆడియో
- కెమెరా: షట్టర్‌తో HD వెబ్‌క్యామ్
- బ్యాటరీ: 42 Wh లిథియం-పాలిమర్ బ్యాటరీ
- ఛార్జింగ్: టైప్-సి ద్వారా 45W
అదనంగా, పోర్ట్‌లు 3.2 Gen 1 (Type-C), USB 3.2 Gen 1, USB 2.0, HDMI 1.4 మరియు 3.5mm కాంబో ఆడియో జాక్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6Eని కూడా కలిగి ఉంది. ఏసూస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ 17.9 మిమీ మందంతో బరువు 1.7 కిలోలు ఉంటుంది.
ప్రారంభ ధర రూ. 49,900/-
Asus Zenbook S13 OLED స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
- డాల్బీ విజన్‌తో 13.3 అంగుళాల 2.8K Asus Lumina OLED డిస్‌ప్లే
- 32GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్
- ఆడియో: డ్యూయల్ హర్మాన్ కార్డాన్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్
- కెమెరా: యాంబియంట్ లైట్, కలర్ సెన్సార్‌తో కూడిన FHD 3DNR IR కెమెరా
- బ్యాటరీ: 63 Wh లిథియం-పాలిమర్ బ్యాటరీ
- ఛార్జింగ్: టైప్-సి ద్వారా 65W
అదనంగా, కనెక్టివిటీ ఆప్షన్‌లలో థండర్‌బోల్ట్ 4 USB-C, HDMI 2.1, మరియు USB 3.2 Gen 2 టైప్-A, అలాగే వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి Wi-Fi 6E ఉన్నాయి. ఏసూస్ Zenbook S13 OLED ల్యాప్‌టాప్ 10.9 మిమీ మందంతో బరువు 1 కిలో ఉంటుంది.
ప్రారంభ ధర రూ. 1,29,990/-