BSNL Mithram Plus Plan: బీఎస్ఎన్ఎల్ 5జీబీ డేటా ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీ, కేవలం 109 రూపాయలకే, 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ సదుపాయం
BSNL (Photo Credit: Livemint)

Mumbai, December 20: ప్రభుత్వ టెలికం రంగం దిగ్గజం భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited)(బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" (Mithram Plus) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5జీబీ డేటాను యూజర్లకు అందిస్తోంది.

దీంతోపాటు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ సదుపాయం లభిస్తుంది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్‌బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కేరళ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం రూ. 109 మిత్రం ప్లస్ ప్లాన్ 5 జీబీ డేటా, ముంబై ఢిల్లీ, సర్కిల్‌లతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అయితే కేరళ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు.