![](https://test1.latestly.com/wp-content/uploads/2019/12/BSNL-380x214.jpg)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను (BSNL Prepaid Plan) ప్రకటించింది. ఈ ప్లాన్ కోసం రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అదే సమయంలో రోజుకు 5జీబీ డేటా కూడా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్ లతో పాటు జింగ్ మ్యూజిక్ కూడా ఫ్రీ. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఇటీవల ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ప్లాన్ల ధరలు పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన తాజా ఆఫర్ కు యూజర్ల నుంచి విశేష స్పందన వస్తుందని భావిస్తున్నారు.
ఇక ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థలు యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను విభినమైన ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన బేసిక్ ప్లాన్స్ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం డిస్నీ-హాట్‌స్టార్ కూడా సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లిస్తే నెలరోజులపాటు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించనుంది.
రూ. 49 ప్లాన్ వివరాలు..!
డిస్నీ+హాట్‌స్టార్ రూ. 49 ప్లాన్ ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్స్ ఏదైనా ఒక డివైజ్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్ సేవలను పొందవచ్చును. అంతేకాకుండా 720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూసే అవకాశాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ కల్పించనుంది.