BSNL Offers: కొత్త ఆఫర్లతో దూసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించిన టెలికం దిగ్గజం, కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి 4జీ సిమ్‌ ఉచితం
BSNL (Photo Credit: Livemint)

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను (BSNL BroadBand Plan Offers) సవరించింది. సూపర్ స్టార్ 2 ప్లాన్‌గా పిలిచే బ్రాడ్‌ బ్యాండ్‌ రూ . 949 ప్లాన్‌లో తాజాగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేస్తోంది. ఈ లిమిట్‌ దాటిన తరువాత డేటా స్పీడ్‌ 10 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధర రూ .777 నుండి రూ .16999 వరకు ఉండగా ఎఫ్‌టిటిహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మార్చి 31, 2021 వరకు ఉచితంగా ఇన్‌స్టాల్ చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్లను మార్చి 1 న సవరించింది. ఇందులో హై స్పీడ్‌,అధిక డేటా అందిస్తోంది. ఈ కొన్నిప్లాన్ల రేటు మార్చలేదు కానీ పేర్లను మార్చింది. సూపర్ స్టార్ 2 ప్లాన్ అని కూడా పిలిచే ఈ ప్లాన్లు ఇలా ఉంటాయి.ఃః

కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ గానీ, ల్యాండ్‌లైన్ కనెక్షన్ గానీ తీసుకున్న వారికి 4జీ సిమ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఈ 4జీ సిమ్ కార్డులను ఉచితంగా ఇస్తున్న స్కీంను గత వారం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఫ్రీ సిమ్ పొందేందుకు వీలుంది.

వాట్సాప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్, ఇకపై ఇతరులకు ఆడియో మ్యూట్ చేసి కేవలం వీడియో మాత్రమే పంపవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

ఈ ఫ్రీగా అందించే సిమ్ 75 రూపాయల ప్లాన్ ఓచర్‌తో వస్తుంది. 100 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు 2 జీబీ డేటాను 60 రోజుల పాటు ఆస్వాదించవచ్చు. వినియోగదారులను ఆకట్టుకుని సిమ్ కార్డ్స్ సేల్స్‌ను పెంచుకోవడానికే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు టెలికాం నిపుణులు చెబుతున్నారు.

రూ .1000 లోపు ప్లాన్స్‌

రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: దీన్ని ఇపుడు ‘ఫైబర్ టీబీ ప్లాన్‌గా మార్చింది. ఇందులో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ డేటా లభ్యం.

రూ 779 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎందుకు మార్చలేదో స్పష్టంగా తెలియదు. ఇది యథాతథంగా ఉంది.

రూ 849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1500 జీబీ డేటా

రూ .949 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ డేటా

రూ .2500 లోపు ప్లాన్స్‌

రూ .1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3300 జీబీ వరకు డేటా

రూ. 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా

రూ .2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5500 జీబీ వరకు డేటా

టాప్-టైర్ ప్లాన్‌ల ధరలు రూ. 4499, రూ .5999, రూ .999, రూ .16,999గా ఉంటాయి. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 6500, 8000, 12000, 21000 జీబీ వరకు డేటా అందిస్తుంది.