Realme Narzo 70 Pro 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తమ బ్రాండ్ నుంచి Narzo స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా 'రియల్‌మి నాజ్రో 70 ప్రో 5జీ' పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్. దీని బేస్ మోడల్ కోసం ధర రూ.19,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే . ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రు. 2000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
ఆకర్షణీయమైన హారిజన్ గ్లాస్ డిజైన్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన సామర్థ్యం కలిగిన బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్, అద్బుతమైన ప్రైమరీ కెమెరా మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, ఎయిర్ గెస్చర్ కంట్రోల్స్ వంటి వినూత్న ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.
అదనంగా, కొత్త Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.
Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
- 8GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
- వెనకవైపు 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SuperVOOC ఛార్జింగ్
ధరలు: 8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 19,999/-
8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 21,999/-
వినియోగదారులు ఈ ఫోన్ ను గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. మార్చి 22 నుండి, స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌తో పాటు రిటైల్ షాపుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా డిస్కౌంట్ తో పాటు రూ. 2,299 విలువైన Realme బడ్స్ T300ని ఉచితంగా పొందవచ్చు.