Shaktikanta Das (Credits: X)

బ్యాంక్‌ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ (UPI)ద్వారా బ్యాంకుల్లో క్యాష్‌ డిపాజిట్‌ చేసే అవకాశాన్ని త్వరలో ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ సమీక్షలో క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్ల’(CDMA)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్‌ డిపాజిట్‌ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ కోసం భారీ క్యూల‌ను నియంత్రించేందుకు క్యాష్ డిపాజిట్ మెషిన్ (CDM)ల‌ను ఆర్‌బీఐ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ ఫీచర్ సాయంతో సీడీఎంల్లో బ్యాంకు ఎకౌంట్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి లేదంటే డెబిట్ కార్డుతో ఓపెన్ చేసి క్యాష్ వేయొచ్చు. ఇప్పుడు అదే సీడీఎంల ద‌గ్గ‌ర క్యాష్ కాకుండా యూపీఐ ద్వారా మ‌నీ డిపాజిట్ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామంటోంది ఆర్‌బీఐ. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా త్వ‌ర‌లోనే తీసుకొస్తామ‌ని చెప్పింది. ఏడోసారి కూడా రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

గతంలో డెబిట్‌ కార్డ్‌ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్‌ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు.

థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్స్​ (PPIs) లింక్​ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్​ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్స్​ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్​ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్​బీఐ నిర్ణయించింది.