ChatGPT vs Bard: మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన గూగుల్, చాట్‌బాట్‌కి పోటీగా బార్డ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన సుందర్ పిచాయ్
Microsoft's ChatGPT & Google's Bard Representative Image (Photo Credits : Pixabay)

మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబ‌డులతో గూగుల్‌కి సవాల్‌గా తీసుకొచ్చిన చాట్‌జీపీటీకి పోటీగా (ChatGPT vs Bard) గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కోసం ఈ ఏఐ (Artificial Intelligence)సర్వీస్ బార్డ్‌ను రిలీజ్‌ ఓపెన్‌ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని గూగుల్‌,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సోమవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని తెలిపారు.ఏఐ వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్‌లో గూగుల్ దాదాపు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,299 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు పిచాయ్‌ చెప్పారు.

యూజర్లకు ఫోన్ పే శుభవార్త, విదేశాలకు కూడా మీ ఫోన్ పే నుండి యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు, కొత్త ఫీచర్ లాంచ్ చేసిన PhonePe

లాంగ్వేజ్ మోడ‌ల్ ఫ‌ర్ డైలాగ్ అప్లికేష‌న్ (Language Model for Dialogue Applications- LaMDA )` అనే టూల్ సాయంతో లైట్ వెయిట్ మోడ‌ల్ వ‌ర్ష‌న్ చాట్‌బోట్ సేవ‌లు ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. లెస్ కంప్యూటింగ్ పవ‌ర్‌తో చాట్‌బోట్‌కు మ‌రింత ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్న‌ది. టిక్‌టాక్,ఇన్‌స్టాగ్రామ్‌లను అధిగమించి చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ వార్తల్లో నిలిచింది. ఈ జనవరిలో దాదాపు 100 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను సాధించిన సంగతి తెలిసిందే.