CMF Phone 1

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) భారత్ మార్కెట్లోకి తన సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) సోమవారం విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్వోసీతో వస్తు్న్న సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1).. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ అన్ స్పెషిఫైడ్ సోనీ సెన్సర్ ఎలాంగ్ విత్ సపోర్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), 2ఎక్స్ జూమ్ తో పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది

CMF ఫోన్ 1.. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ కోసం రూ. 15,999కి అందుబాటులో ఉంది. అధిక 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది, దీని ధర రూ. 17,999. బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది జూలై 12న మొదటి సేల్‌ను కలిగి ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, CMF మొదటి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 1,000 తక్షణ తగ్గింపును అందించింది.మీరు 33W ఛార్జర్‌ను రూ. 749కి పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, CMF ఇండియా వెబ్‌సైట్, ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వీడియో ఇదిగో, రోడ్లపై పురుషులతో పాటు మహిళలు కూడా నగ్నంగా ప్రదర్శన, టొరంటో ప్రైడ్ పరేడ్ 2024పై మండిపడుతున్న నెటిజన్లు

సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.6 వర్షన్ మీద పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ ఎల్‌టీపీఎస్ డిస్ ప్లే కలిగి ఉంటది. 395 పీపీై పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.