San Francisco, FEB 08: ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది. (EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ చెప్పారు. డెల్ కంపెనీ కూడా తాజాగా 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ తెలిపింది.
More tech layoffs. San Jose-based Ebay plan to cut 500 jobs.
View layoff tracker here: https://t.co/geCTEurANv pic.twitter.com/LXtvvcdTih
— NBC Bay Area (@nbcbayarea) February 7, 2023
మరో దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరో వైపు ఆన్ లైన్ గృహోపకరణాల రిటైల్ కంపెనీ 1750 మంది ఉద్యోగులను తొలగించింది. వరుసగా ఉద్యోగాల తొలగింపులతో యువతీ, యువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అటు ఇప్పటికే జూమ్(Zoom app) కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా భారీగా నియామకాలు చేసుకున్న జూమ్ కంపెనీ(Zoom)...తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అంటే దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగించనుంది. కరోనా సమయంలో భారీగా సేవలు అందించాల్సిన అవసరం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకున్నామని, ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గించుకోవడంలో భాగంగా తొలగింపులు తప్పడం లేదని జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ (Eric Yuan) తెలిపారు.