Twitter Logo Change (PIC@ Elon Musk)

Washington, July 23: సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్విట్టర్ లోగో’ (Twitter Logo) సంపూర్ణంగా మారిపోనున్నది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్’ను టేకోవర్ చేసుకున్న నాటి నుంచి సంస్థలు  సమూల మార్పులు తీసుకొచ్చారు ఎలన్‌మస్క్ (Elon Musk). తాజాగా ట్విట్టర్ లోగో పూర్తిగా మార్చేస్తామని సంకేతాలిచ్చారు. దానికి బదులు ‘ఎక్స్’ అనే అక్షరంతో కూడిన లోగో సరిపోతుందని కూడా ట్వీట్ (Twitter) చేశారు. దీని ప్రకారం క్రమంగా ట్విట్టర్ బ్రాండ్‌కు, దానిగుర్తుగా ఉన్న ‘అన్ని పక్షు’లకు వీడ్కోలు చెబుతామని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 12.06 గంటలకు ‘రాత్రికి ‘ఎక్స్’ లోగో పోస్ట్ చేస్తే సరిపోతుందనుకుంటా.. రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా లైవ్’లోకి వెళుతుంది` అని ఎలన్  మస్క్ మరో ట్వీట్’లో పేర్కొన్నారు.

ట్విట్టర్’లో తొలి నుంచి ఎలన్ మస్క్ చేస్తున్న మార్పులకు యూజర్లు,  నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే లోగో మార్పు విషయంలోనూ మిశ్రమ స్పందన కాన వచ్చింది. ట్విట్టర్’లోగో మార్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కొందరు ట్వీట్ చేస్తే మరి కొందరు అటువంటి పొరపాటు చేయొద్దని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, ట్విట్టర్’ను ఇటీవల తాను ఏర్పాటు చేసిన కొత్త సంస్థ ‘ఎక్స్ కార్ప్’లో విలీనం చేస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఆయనకు ‘ఎక్స్’ అనే అక్షరం అంటే ఎంతో ఇష్టం. ట్విట్టర్ సీఈఓగా లిండా యాంకరినో బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా సంస్థను ఎవ్రీథింగ్ యాప్ ‘ఎక్స్’ మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.