Facebook Special Section: ఫేస్‌బుక్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదో తెలుసుకోవచ్చు, ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీ
Facebook Data Leak (Photo Credits: Pexels)

New Delhi, June 23: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో (Facebook) ఇంట్రెస్టింగ్ ఫీచర్ (Interesting Feature) గురించి తెలుసా? మీరు ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టులు (Friend request) పంపారో.. ఎవరెవరో మీ రిక్వెస్ట్ అంగీకరించలేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు సంబంధించి ఫేస్‌బుక్ ఎప్పుడో ఈ సెక్షన్ ప్రవేశపెట్టింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయని లిస్టు మొత్తం ఈ సెక్షన్‌లోనే చూడొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సెక్షన్ ఎప్పటినుంచో ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుసు. Facebook మీ రిక్వెస్టులను విస్మరించిన యూజర్ల జాబితాను మాత్రమే కాకుండా.. మీ స్నేహితుని రిక్వెస్ట్‌ను (Request) మీరు గమనించని సమయాన్ని కూడా చూపిస్తుంది.

ఉదాహరణకు.. మీరు ఒక ఏడాది క్రితం ఒక వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినట్లయితే.. ఆ అభ్యర్థన ఎప్పుడు పంపారో మీకు గుర్తులేకపోయినా Facebook మీకు ఖచ్చితమైన టైమ్‌లైన్‌ను (Timeline) చూపుతుంది. ముఖ్యంగా.. Facebook మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆమోదించని లేదా తిరస్కరించని వ్యక్తులను మాత్రమే చూపుతుంది. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ తిరస్కరించిన యూజర్ల జాబితాను ఫేస్‌బుక్ చూపించదు.

Find Your Wi-Fi Password: వైఫై పాస్‌ వర్డ్‌ను మర్చిపోయారా? ఇలా చేస్తే చాలు ఈజీగా తిరిగి తెలుసుకోవచ్చు, విండోస్ 11 లో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి 

మీ అభ్యర్థనను వ్యక్తులు ఎందుకు విస్మరించారనే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. సోషల్ మీడియా సైట్‌లో యాక్టివ్‌గా ఉండకపోవచ్చు లేదా వారి అకౌంట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయి ఉండవచ్చు. అయితే, మీ స్నేహితుని అభ్యర్థనను ఎవరు అంగీకరించలేదని తెలుసుకోవాలనుకుంటే.. చెక్ చేయడానికి ఈ కింది విధంగా ట్రై చేయండి..

WhatsApp Groups Banned: వాట్సప్ గ్రూపులతో జాగ్రత్త, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న 10 మంది అరెస్ట్, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ 

మీ Facebook యాప్‌ని ఓపెన్ చేయండి.

  • మూడు లైన్ల సింబల్ మెనూకి వెళ్లండి
  • మీరు ఆప్షన్ల లిస్టును చూడొచ్చు. అక్కడే మీ స్నేహితులను ఎంచుకోండి.
  • మీరు స్నేహితులను ఎంచుకున్నప్పుడు.. మీ ఫ్రెండ్ రిక్వెస్టులను పంపిన వ్యక్తుల లిస్టు మీకు చూపిస్తుంది.
  • మీరు వాటన్నింటినీ విస్మరించి.. మీ స్క్రీన్ కుడి ఎగువన ఉన్న See All ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • ఇక్కడ See All ఆప్షన్ బ్లూ కలర్‌లో హైలైట్ అయి ఉంటుంది. దీన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు.
  • మీరు “See All” ఆప్షన్ ట్యాప్ చేసినప్పుడు.. మీకు వచ్చిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య కనిపిస్తుంది.
  • స్క్రీన్ కుడి పైభాగంలో మీరు సెర్చ్ బాక్స్ పక్కన త్రి డాట్స్ కనిపిస్తాయి.
  • మీరు ఆ త్రి డాట్స్ ట్యాప్ చేయగానే.. స్క్రీన్ దిగువ నుంచి పాప్-అప్ రిక్వెస్టుల  ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
  • View Sent Request ఆప్షన్‌పై నొక్కండి.
  • మీ అభ్యర్థనను ఆమోదించని వ్యక్తుల లిస్టును మీరు చూడవచ్చు.
  • మీరు అభ్యర్థన పంపిన సమయాన్ని కూడా Facebook మీకు చూపిస్తుంది.