New Delhi, FEB 03: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ (Fastag Kyc ) గడువు తేదీని ఎన్‌హెచ్ఏఐ (NHAI) మరోసారి పొడిగించింది. ఇప్పటివరకూ ఉన్న ఒకటి కన్నా ఎక్కువ కార్ల కోసం ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం లేదా ఒకే వాహనంతో బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను లింక్ చేయడం కుదరదు. ఈ మేరకు ఎన్‌హెచ్ఏఐ ‘ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్’ (Fastag Kyc) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చింది. వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రస్తుతం జనవరి 31వరకు ఉన్న గడువు తేదీని ఈ నెల 29 వరకు పొడిగించింది.
ఇప్పటికి కేవైసీ పూర్తిచేయని వారితో పాటు ప్రాథమికంగా కేవైసీ కాని (non-kyc) కస్టమర్ల కోసం..
https://fastag.ihmcl.com వెబ్‌సైట్‌ని సందర్శించి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఓటీపీ ఆధారిత ధ్రువీకరణను కూడా ఎంచుకోవచ్చు.
లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ మెనుకి నావిగేట్ చేయండి. డాష్‌బోర్డ్ ఎడమ వైపున ‘My Profile’ ఆప్షన్ ఎంచుకోండి. అది మిమ్మల్ని ‘My Profile’ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది.
‘My Profile’ పేజీలో ‘Profile‘ సబ్ సెక్షన్ సమీపంలో ఉన్న ‘KYC’ సబ్ సెక్షన్ కనుగొని, దానిపై క్లిక్ చేయండి.
‘KYC’ సబ్ సెక్షన్‌లో ‘Customer Type’ ఎంచుకోండి. ఆపై, అవసరమైన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా తప్పనిసరి ఫీల్డ్‌లను పూర్తి చేయండి.
తప్పనిసరి డిక్లరేషన్‌ను టిక్ మార్క్ చేయండి.
డిక్లరేషన్ : నేను/మేము అందించిన డాక్యుమెంట్లు అన్ని ప్రామాణికమైన పత్రాలు అని ధృవీకరించడమైనది. నేను/మా వద్ద అసలైనవి ఉన్నాయి.
మీరు https://www.netc.org.in/request-for-netc-fastag వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
(NETC) ఫాస్ట్‌ట్యాగ్ కోసం అభ్యర్థన కింద మీ ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును ఎంచుకుని సందర్శించే వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయండి.
సంబంధిత ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకుకు లాగిన్ చేయండి
కేవైసీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి.
ఒకవేళ మీ బ్యాంక్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదా రిమైండర్‌ను అందుకోనట్లయితే.. మీ కేవైసీ పూర్తయిందని, మీ వైపు నుంచి ఎలాంటి చర్య అవసరం లేదని అర్థం.