రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు (RBI Action Against Paytm) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.

అయితే.. కస్టమర్లు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ని ఎలాంటి సమస్య లేకుండా విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ (Reserve Bank of India ) అనుమతి ఇచ్చింది. దీంతో పాటుగా పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ ఖాతాలను కూడా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.అయితే ఈ ఆంక్షలు Paytm యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ తెలిపింది.  ఆగని లేఆఫ్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న పేపాల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)