Mumbai, December 6: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) విద్యార్థు(Students)లకు బంపర్ ఆఫర్(Flipkart Stunning Offer)ను ప్రకటించింది. తన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్(Flipkart Plus Membership)ను స్టూడెంట్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. వయస్సుతో సంబంధం లేదు. విద్యార్థి అయితే చాలు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు. అందుకుగాను స్టూడెంట్లు ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్(Mobile APP)ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో తమ కాలేజ్ ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను ఎంటర్ చేసి సదరు మెంబర్‌షిప్‌కు అప్లయి చేయాలి.
దీంతో వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్, మెసేజ్ వస్తాయి. ఆ తరువాత స్టూడెంట్లు తమ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ మెంబర్‌షిప్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు కొనే ప్రొడక్ట్‌లను ఉచితంగా, వేగంగా డెలివరీ అందుకోవచ్చు. అలాగే ప్రత్యేక సేల్‌లు నిర్వహించినప్పుడు సాధారణ యూజర్ల కన్నా ముందుగానే ప్లస్ మెంబర్లకు సేల్‌లు అందుబాటులోకి వస్తాయి.
ఇక ఫ్లిప్‌కార్ట్‌లో రూ.100 విలువైన వస్తువును కొనుగోలు చేస్తే 4 సూపర్ కాయిన్స్ ఇస్తారు. అలా కాయిన్స్ జమ అయ్యాక నిర్దిష్ట మొత్తంలో కాయిన్స్‌కు ఫ్లిప్‌కార్ట్ సదరు ప్లస్ మెంబర్‌షిప్‌ను మళ్లీ రెన్యువల్ చేస్తుంది.అమెజాన్ ప్రైమ్, పేటీఎం ఫస్ట్ లాంటి లాయల్టీ ప్రోగ్రామ్ లాంటిదే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అని చెప్పవచ్చు.