Hyderabad, July 27: ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో (Google Maps) హైదరాబాద్‌లోని వీధులను మరింత క్షుణ్ణంగా చూడొచ్చు. అక్కడి రోడ్లు, దుకాణాలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు వంటి వాటిని మరింత స్పష్టంగా చూసే అవకాశం కల్పించింది గూగుల్. హైదరాబాద్ (Hyderabad) సహా దేశంలోని 10 నగరాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ (Street View)సేవలను ప్రారంభించింది. భద్రతాపర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో స్ట్రీట్ వ్యూ (Street View)సేవలను కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం బ్యాన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సేవలకు అనుమతి దక్కడంతో జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో సంయుక్తంగా గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఈ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు (Bengalore), నాసిక్ (Nasik), పుణే(Pune), వడదోరా (vadodara), చెన్నై (Chaennai), ఢిల్లీ(Delhi), ముంబై (Mumbai) నగరాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
Google Maps launches street view service in India https://t.co/mMNeb5mM9n pic.twitter.com/ZS7kNg4Oq5
— Reuters (@Reuters) July 27, 2022
చాలా స్పష్టంగా కనపడే చిత్రాలను యూజర్లు గూగుల్ స్ట్రీట్ (Google street) ద్వారా చూడొచ్చు. వీధులు, రోడ్లు, పర్యాటక ప్రదేశాలు, కొండలు, నదుల వంటివి 360 డిగ్రీల కోణంలోనూ చూడొచ్చు. స్ట్రీట్ వ్యూ ఫీచర్ నేటి నుంచి గూగుల్ మ్యాప్‌లో అందుబాటులోకి వచ్చింది.
నిక భాగస్వామ్య సంస్థలతో కలిసి తాజాగా ఈ లైసెన్సును పొందాం. భారత్‌లోని 10 నగరాల్లో 1,50,000 కిలోమీటర్ల మేర ఈ సేవలు అందుతాయి” అని గూగుల్ పేర్కొంది. గూగుల్(Google), జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలు సంయుక్తంగా గూగుల్ మ్యాప్స్ సేవలను 2022 ఏడాది ముగిసేనాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ సేవలను విస్తరించాలని ప్రణాళికలు వేసుకున్నాయి. మరోవైపు, గూగుల్ మ్యాప్స్ బెంగళూరులో నేటి నుంచి మరో ఫీచర్‌ను ప్రారంభించింది. రోడ్లపై వేగ పరిమితిని గురించి కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడి ట్రాఫిక్ అధికారుల సాయంతో ఈ సేవలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాల్లో ప్రారంభించే అవకాశం ఉంది.