Google play Representative image (Photo Credit- Twitter)

చట్టబద్ధంగా లేని దాదాపు 3,500 యాప్‌లను ప్లే స్టోర్ నుండి గూగుల్‌ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. గూగుల్‌ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్‌ చర్య తీసుకుంది.

ఆ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్‌ తన విధానాన్ని 2021లో అప్‌డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్‌ పొందినట్లు యాప్ డెవలపర్‌లు ధ్రువీకరించాలి.

ప్రపంచ వ్యాప్తంగా స్పాటిఫై మ్యూజిక్ సర్వీసులు డౌన్, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులతో హెరెత్తించిన నెటిజన్లు, పరిశీలిస్తున్నామని తెలిపిన కంపెనీ

అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్‌ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి.