Google CEO Sundar Pichai (Photo Credits: IANS)

New Delhi, July 13: ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను (Google for India Digitisation Fund) వెల్లడించింది. భార‌తీయ స్టార్ట్ అప్స్‌లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ (Sundar Pichai) తెలిపారు. గూగుల్ ఆఫ్ ఇండియా (Google for India) కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ పెట్టుబ‌డుల‌ను ప్ర‌క‌టించారు. అమ్మే వస్తువు ఏ దేశానిదో తప్పనిసరిగా చెప్పాలి, ఈ కామర్స్ దిగ్గజాలను కోరిన డిపిఐఐటి, కొంత సమయం కావాలని కోరిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు

ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కానున్న‌ట్లు సుంద‌ర్ పిచాయ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా విజ‌న్‌తో ప్ర‌ధాని మోదీ ప‌నిచేస్తున్న తీర ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో భారత్‌లో 75,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెచ్చిస్తామని గూగుల్‌ సోమవారం ప్రకటించింది. గూగుల్‌ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ ఫర్‌ ఇండియా వర్చువల్‌ ఈవెంట్‌లో పేర్కొన్నారు.

Here's Google CEO Tweet

Here's PM Modi Tweet

ఈ మొత్తాన్ని ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని స్పష్టం చేశారు. భారత్‌ భవితవ్యం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై (Google For India 2020) తమకున్న నిదర్శనానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టిసారిస్తాయని చెప్పారు.

ఈ రోజు ప్ర‌ధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. సుంద‌ర్ పిచాయ్‌తో అర్థవంత‌మైన చ‌ర్చ‌లో పాల్గొన్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ప‌లు ర‌కాల అంశాల‌పై పిచాయ్‌తో మాట్లాడిన‌ట్లు మోదీ తెలిపారు. భార‌తీయ రైతులు, యువ‌త‌, పారిశ్రామిక వేత్త‌ల‌ను మార్చ‌డంలో టెక్నాల‌జీ పోషించే పాత్ర గురించి చ‌ర్చించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.

ప్రతి భారతీయుడకి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడం, భారత్‌ అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలు డిజిటల్‌ బాట పట్టేలా సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్‌ ఇంటెలిజెన్స్‌ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను వెచ్చిస్తామని గూగుల్ సీఈఓ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్‌ ఇండియా విజన్‌ను సుందర్‌ పిచాయ్‌ ప్రశంసిస్తూ ఆన్‌లైన్‌ వేదికలో భారత్‌ గొప్ప పురోగతి సాధించిందని ప్రస్తుతించారు. డిజిటల్‌ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.

తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, డేటా ధరల తగ్గింపు, అంతర్జాతీయ స్ధాయి మౌలిక వసతులతో నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు. 2004లో గూగుల్‌ హైదరాబాద్‌, బెంగళూర్‌ నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంలో భారతీయ యూజర్లకు మెరుగైన సెర్చ్‌ సేవలను అందించడంపైనే ఫోకస్‌ చేశామని చెప్పారు. చదవండి : గూగుల్‌, అమెజాన్‌లకు చెక్‌